8వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్.. ఓ గదిలో బంధించి..
Girl Student Returning From Coaching Gang Raped In Patna. కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికను సోమవారం సాయంత్రం
By అంజి Published on 4 Jan 2023 5:17 PM ISTకోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికను సోమవారం సాయంత్రం ఐదుగురు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన బీహార్ రాజధాని పాట్నాలో కలకలం రేపింది. ఈ వార్త దావనంలా వ్యాప్తించడంతో పాట్నా నగరంలో నిరసనలు చెలరేగాయి. ఈ దారుణ ఘటన గురించి తెలియడంతో ఆగ్రహించిన స్థానికులు నిందితుల ముఠాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలిక రామానుజ్ కోచింగ్ సెంటర్‌లో ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఐదుగురు వ్యక్తులు సాయంత్రం 6:30 గంటల సమయంలో బాలికను ఆటోరిక్షాలో అపహరించి, జల్లా ప్రాంతంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ప్రదేశానికి వెళ్లారు.
నిందితులను గోలు కుమార్, ముఖేష్ కుమార్, ప్రమోద్ కుమార్, సుగ్రీవ్ కుమార్, ఆటోరిక్షా డ్రైవర్‌గా గుర్తించినట్లు రిపోర్టు తెలిపింది. బాలికను ఓ గదిలో బందీగా ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డారు. దారుణంగా దాడి చేయడంతో బాలిక స్పృహతప్పి పడిపోయింది. పారిపోయే ముందు నిందితులు ఆమెను శని దేవాలయం సమీపంలో పడేశారు. అయితే, కొంతసేపటి తర్వాత బాలిక స్పృహలోకి రావడంతో ఇంటికి వెళ్లే దారి కోసం చూసింది. ఆమె తన తల్లిదండ్రులకు ప్రతిదీ చెప్పింది. ఆ తర్వాత వారు బైపాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
అయితే, నిందితుల్లో నలుగురు పరారీలో ఉన్నారని, ఈ సంఘటనలో పాల్గొన్న డ్రైవర్‌ను మాత్రమే పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారని రిపోర్టు పేర్కొంది. గతేడాది బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి ఐదుగురు వ్యక్తులు నెల రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. మహనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన బాధితురాలు నవంబర్ రెండో వారంలో జండాహా మార్కెట్‌కు వెళ్తుండగా ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిందితులు ఆమెను బలవంతంగా ట్రక్కులోకి లాగి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆమెను ఒక నెలపాటు బందీగా ఉంచారు. అక్కడ వారు ఆమెపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఐదుగురు నిందితులు ఢిల్లీలో ఒక నెల పాటు తనపై పదేపదే అత్యాచారం చేశారని, ఆపై తిరిగి వైశాలి వద్దకు తీసుకెళ్లి తన గ్రామ సమీపంలో వదిలిపెట్టారని బాలిక పోలీసులకు తెలిపింది.