హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థినిపై వ్యక్తి కత్తితో దాడి

Girl student allegedly attacked by stalker with knife near OU. హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. ఓ యువతిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ముషీరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో ఈ దాడి

By అంజి  Published on  25 Sept 2022 11:44 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థినిపై వ్యక్తి కత్తితో దాడి

హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. ఓ యువతిపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ముషీరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాచిగూడలోని పాతిమా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యువతి ముషీరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. గాయపడిన యువతి, దాడి చేసిన యువకుడు రంజిత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు స్నేహితురాలితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా రంజిత్ యువతి వద్దకు వచ్చి వాగ్వాదం పెట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో రంజిత్ యువతిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి మణికట్టు, చేతిపై గాయాలు తగిలాయి, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. పెళ్లికి యువకుడు నిరాకరించడంతోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.

Next Story