గణేష్‌ ఊరేగింపు జరుగుతుండగా.. బాలికపై సామూహిక అత్యాచారం

Girl sexually assaulted by three youths in Tirupati district. ఏపీలోని పవిత్ర పుణ్యక్షేత్ర ప్రాంతమైన తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికపై ముగ్గురు

By అంజి  Published on  1 Sept 2022 4:41 PM IST
గణేష్‌ ఊరేగింపు జరుగుతుండగా.. బాలికపై సామూహిక అత్యాచారం

ఏపీలోని పవిత్ర పుణ్యక్షేత్ర ప్రాంతమైన తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికపై ముగ్గురు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లాలోని ఎమ్మారాజుల కంట్రిగ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గణేష్‌ ఊరేగింపు చూసేందుకు వచ్చిన బాలికకు ముగ్గురు యువకులు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు. ఆ తర్వాత బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఘటన తర్వాత స్పృహ నుంచి కోలుకున్న బాలిక.. నేరుగా ఇంటి వచ్చింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి, అమ్మమ్మ కేవీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థతి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్పగాయాలు కావడంతో బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.

Next Story