బాలికపై సామూహిక అత్యాచారం.. ఆ భయంతో నిందితుడు ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  7 Sep 2023 8:15 AM GMT
Girl kidnap, Agra, Crime news, suicide

బాలికపై సామూహిక అత్యాచారం.. ఆ భయంతో నిందితుడు ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అరెస్టు భయంతో ఈ కేసులో ఒక నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తన తండ్రి దుకాణం నుంచి తిరిగి వస్తుండగా బాలిక అపహరణకు గురైంది. ఆమెను మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తి అడ్డగించి, తర్వాత ఆటోరిక్షా లోపలికి లాగారు. మంగళవారం రోడ్డు పక్కన పడి ఉన్న ఆమెను ఇటుక బట్టీల నిర్వాహకులు గుర్తించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో తనపై అభియోగాలు మోపారని తెలుసుకున్న నిందితుల్లో ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మరో నిందితుడిని అరెస్టు చేశామని, మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని నిబంధనల ప్రకారం రూపేష్, కరువా, జగదీష్ (18 మరియు 20 సంవత్సరాల మధ్య వయస్సు)లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడింది. నిందితులు శంషాబాద్‌లోని ఓ గ్రామానికి చెందినవారు. మైనర్ బాలికను ఆటోరిక్షాలో కిడ్నాప్ చేసి గ్రామ శివారులో అత్యాచారానికి పాల్పడ్డారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ పాండే తెలిపారు.

"విచారణ మమ్మల్ని నిందితుల గ్రామానికి తీసుకువెళ్లింది. అరెస్టు భయంతో, జగదీష్ తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు" అని తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సోమేంద్ర మీనా మాట్లాడుతూ.. "నిందితుడైన ఆటోరిక్షా డ్రైవర్ రూపేష్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతడిని ప్రశ్నిస్తున్నాం. కరువాను అరెస్టు చేసేందుకు ఆరు బృందాలను గాలిస్తున్నాయని తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు.

Next Story