త‌ల్లితో వివాహేత‌ర సంబంధం.. వ్య‌క్తి మ‌ర్మాంగాన్ని బ్లేడ్‌తో కోసిన కుమారై

Girl attack on man with blade in Guntur district.త‌న త‌ల్లితో ఓ వ్య‌క్తి వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తుండ‌డాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2022 9:47 AM IST
త‌ల్లితో వివాహేత‌ర సంబంధం.. వ్య‌క్తి మ‌ర్మాంగాన్ని బ్లేడ్‌తో కోసిన కుమారై

త‌న త‌ల్లితో ఓ వ్య‌క్తి వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తుండ‌డాన్ని త‌ట్టుకోలేని కుమారై.. అత‌డి మ‌ర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘ‌ట‌న తెనాలిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. బాప‌ట్ల జిల్లా చెరుకుప‌ల్లి మండ‌లం తుమ్మ‌ల‌పాలెం గ్రామానికి చెందిన రామ‌చంద్రారెడ్డి బ్ర‌తుకుదెరువు కోసం రెండు సంవ‌త్స‌రాల క్రితం తెనాలి వ‌చ్చాడు. ఓ లాడ్జీలో కూలీ పనులు చేసేవాడు. ఇత‌డికి హైతాన‌గ‌ర్‌కు చెందిన ఓ మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఇద్ద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించేవారు.

ఈ క్ర‌మంలో సోమ‌వారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్ద‌రూ మ‌ద్యం సేవించారు. అనంత‌రం అత‌డు భ‌వ‌నంపై నిద్రిస్తున్నాడు. కాగా.. త‌న త‌ల్లి వివాహేత‌ర సంబంధంపై ఎప్ప‌టి నుంచో ఆగ్ర‌హంతో ఉన్న ఆమె కుమారై.. త‌న ప్రియుడితో క‌లిసి రామ‌చంద్రారెడ్డి మ‌ర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. బాధితుడి అరుపులు విన్న స్థానికులు అక్క‌డ‌కు చేరుకున్నారు. అత‌డిని తెనాలి ఆస్ప‌త్రికి త‌రంచారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం అత‌డిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story