విషాదం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు మృతి

Gas cylinder exploded in Anantapur district Four dead.అనంత‌పురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2022 8:31 AM IST
విషాదం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు మృతి

అనంత‌పురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. శెట్టూరు మండ‌లం ముల‌క‌లేడు గ్రామంలోని ఓ ఇంట్లో శ‌నివారం తెల్ల‌వారుజామున గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైనున్న మిద్దె క‌ప్పు కూలి.. నిద్రిస్తున్న వారిపై ప‌డింది. పెద్ద శ‌బ్ధం రావ‌డంతో గ్రామ‌స్థులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. గ్రామ‌స్తులు, అధికారులు క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

శిథిలాలను తొల‌గించి చూడ‌గా.. అప్ప‌టికే న‌లుగురు మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్ర గాయాల‌తో క‌నిపించారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. వీరి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన జైనుబి(60), దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6) గా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు చనిపోవ‌డంతో ఆ గ్రామంలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.

Next Story