దారుణం.. ఫ్రెండ్స్‌తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 2 Oct 2024 9:15 AM ISTదారుణం.. ఫ్రెండ్స్‌తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫ్రెండే బలవంతంగా తీసుకెళ్లి.. తన ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంతేజార్‌గంజ్ పీఎస్ సీఐ శివ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి ఏరియాకు చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఫార్మసీ సెకండీయర్ చదువుతోంది. కాలేజీ సమీపంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. గత నెల 15వ తేదీన ఆమెకు తెలిసిన ఓ యువకుడు హాస్టల్ వద్దకు వెళ్లాడు. మాట్లాడాలంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నారు.
అప్పటికే కారులో మరో ఇద్దరు యువకులు ఉన్నారు. యువతిని బలవంతంగా వరంగల్ వెజిటబుల్ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జి మొదటి అంతస్తులోకి తీసుకెళ్లారు. అక్కడే యువతికి మద్యం తాగించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల ఇంటికి వెళ్లిన బాధితురాలు అత్యాచార విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఈ క్రమంలోనే తల్లి, కుమార్తెలు వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసి జరిగిన విషయం చెప్పారు. ఆయన సూచన మేరకు ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరో యువకుడి పోలీసులు గాలిస్తున్నారు.