మహబూబాబాద్‌లో దారుణం.. యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం

Four men sexually assault a young woman in Mahabubabad. మహబూబాబాద్ జిల్లాలో దారుణం ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి

By అంజి
Published on : 23 Feb 2022 6:27 PM IST

మహబూబాబాద్‌లో దారుణం.. యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం

మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆలేరు గ్రామానికి చెందిన యువతి(23) ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ నెల 18న తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురి పేర్లను సూసైడ్ నోట‌్‌లో రాసి, అవమానం భరించలేక యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

కాగా బంధువులు బాధితురాలిని హుటహుటిన చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. సామూహిక అత్యాచారం జరిగిన విషయం బయటకు రాకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story