దారుణం.. దుండిగ‌ల్‌లో మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

Four men molested women in Dundigal.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2022 11:48 AM IST
దారుణం.. దుండిగ‌ల్‌లో మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఒంట‌రి మ‌హిళ క‌నిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో మహిళపై అర్ధరాత్రి న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం ఓ మ‌హిళ ఉపాధి నిమిత్తం షోలాపూర్ నుంచి దుండిగ‌ల్ కు వ‌చ్చింది. శుక్ర‌వారం రాత్రి గండిమైస‌మ్మ ప్రాంతంలోని బార్ వెనుక ఉన్న ఖాళీ ప్ర‌దేశంలోకి ఆ మ‌హిళ‌ను న‌లుగురు వ్య‌క్తులు బ‌ల‌వంతంగా తీసుకెళ్లారు. అక్క‌డ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధిత మహిళ‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుల‌ను నరసింహ(23), ఇమామ్(20), కుద్దుస్(21), ఉమృద్ధిన్(21)గా గుర్తించారు. వీరంతా ఆటో డ్రైవ‌ర్లుగా ప‌ని చేస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story