ఆటోను దారి మళ్లించి వైద్యురాలిపై సామూహిక అత్యాచారం
Four men arrested molesting Doctor in Vellore.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 22 March 2022 11:06 AM ISTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఓ వైద్యురాలు తన స్నేహితుడితో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆటోను దారి మళ్లించాడు డ్రైవర్. వైద్యురాలు ప్రశ్నించినప్పటికీ సమాధానం ఇవ్వకుండా నది ఒడ్డుకు తీసుకువెళ్లి.. అక్కడ యువతి స్నేహితుడిని బెదిరించి తరిమికొట్టారు. అనంతరం నలుగురు వైద్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ యువతి డాక్టర్‌గా పనిచేస్తుస్తోంది. మూడు రోజుల క్రితం తన స్నేహితుడితో కలిసి కట్పాడిలోని ఓ సినిమా ధియేటర్ లో సెకండ్ షోకి వెళ్లింది. సినిమా చూసిన అనంతరం స్నేహితుడితో కలిసి వేలూరుకి ఆటోలో బయలు దేరింది. అప్పటికే ఆటోలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఆటోను సత్‌వచ్చారిలోని మరో రోడ్డుకు డ్రైవర్ మళ్లించడంతో అనుమానం వచ్చిన యువతి ఇటు వైపు ఎందుకు వెలుతున్నావు అని ప్రశ్నించింది. అయినప్పటికీ సదరు డ్రైవర్ ఎలాంటి సమాధానం చెప్పకుండా అలాగే ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకువెళ్లాడు.
అక్కడ యువతి స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమేశారు. అనంతరం నలుగురు వ్యక్తులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సత్‌వచ్చారి పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.