విషాదం.. పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
Four members of a Family Suicide in Rangareddy District.అప్పుల బాధతో ఆ దంపతులు తనువు చాలించాలని బావించారు.
By తోట వంశీ కుమార్
అప్పుల బాధతో ఆ దంపతులు తనువు చాలించాలని బావించారు. తాము చనిపోతే తమ పిల్లలు ఏమైపోతారోనని అనుకున్నారో ఏమో తెలీదు గానీ దారుణ నిర్ణయం తీసుకున్నారు. చిన్నారులతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెరువులో దూకే ముందే వారు పురుగుల మందు తాగారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సంతోష్‌నగర్‌కు కుద్దూస్ పాషా(37), ఫాతిమా(28) దంపతులు నివసిస్తున్నారు. వీరికి మెహర్(9), ఫిర్దోస్ బేగం(6) సంతానం. కుటుంబంతో కలిసి కుద్దూస్ నిన్న కుర్మల్‌గూడకు వచ్చారు. రాత్రి సమయంలో వీరంతా పురుగుల మందు తాగారు. అనంతరం కుర్మల్‌గూడ చెరువులో దూకారు. గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కుద్దూస్ పాషా, ఓ కుమారైను బయటికి తీయగా అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఉదయం గాలింపు చేపట్టి ఫాతిమా, మరో కుమారై మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా..వీరు అప్పుల బాధతోనే మరణించినట్లు బంధువులు చెబుతు్ననారు. నిన్న రాత్రి రూ.10వేలు కావాలని కుద్దుస్ పాషా తన బామ్మర్ది హమీద్‌ను అడిగాడని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.