విషాదం.. దుర్గమ్మ దర్శనానికి వచ్చి కుటుంబం ఆత్మహత్య
Four Members of a Family Committed suicide in Vijayawada.విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కనకదుర్గ అమ్మవారి
By తోట వంశీ కుమార్ Published on
8 Jan 2022 5:17 AM GMT

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం. కన్యకాపరమేశ్వరీ సత్రంలో తల్లీ కొడుకులు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో నదిలో దూకారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతులను తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా భైంసాకు చెందిన పప్పుల సురేష్ (54), శ్రీలత, కుమారులు ఆశిష్, అఖిల్‌గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జనవరి 6న దుర్గమ్మ దర్శనం కోసం వీరు విజయవాడకు వచ్చారు. కన్యకాపరమేశ్వరీ సత్రంలో బస చేస్తున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఈరోజు తెల్లవారుజామున తల్లి శ్రీలత, కొడుకు ఆశిష్ సత్రంలో విషం తాగి చనిపోగా.. తండ్రి సురేష్, మరో కొడుకు అఖిల్ కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Next Story