ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు స‌జీవ ద‌హ‌నం

Four killed as trucks catch fire after collision in Rajasthan's Ajmer.రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లాలో ఘోర రోడ్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2021 7:38 AM GMT
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు స‌జీవ ద‌హ‌నం

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. నేషనల్ హైవే 8పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. లారీ క్యాబిన్ల‌లో చిక్కుకున్న న‌లుగురు వ్య‌క్తులు స‌జీవ ద‌హ‌నం అయ్యాయి. ఆదర్శ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతం స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగ‌డంతో గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఆర్పేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. చాలా సేప‌టికి గానీ మంట‌లు అదుపులోకి రాలేదు. మంట‌ల దాటికి మూడు మృత‌దేహాలు పూర్తిగా కాలిబూడిద అవ్వ‌గా.. ఓ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. మృతుల‌కు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఆదర్శనగర్ ఎస్ఐ కన్హయ్య లాల్ తెలిపారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం రాత్రి జ‌రిగిన‌ట్లు చెప్పారు.

Next Story
Share it