సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. నలుగురు దుర్మరణం

Four dead in road Accident at Zahirabad.సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 10:31 AM GMT
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. నలుగురు దుర్మరణం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు ద్విచ‌క్ర‌వాహానాన్ని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 8 నెల‌ల చిన్నారి స‌హా న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు.

వివ‌రాల్లోకి వెళితే.. జ‌హీరాబాద్ మండ‌ల ప‌రిధిలోని డిడ్గీ వ‌ద్ద బైక్‌ను కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్ర‌యాణీస్తున్న దంప‌తులు స‌హా 8 నెల‌ల చిన్నారి అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. బైక్ ను ఢీ కొట్టిన అనంత‌రం కారు ప‌ల్టీలు కొట్ట‌డంతో.. కారులో ప్ర‌యాణిస్తున్న‌వ్య‌క్తి కూడా మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానానికి చేరుకున్నారు. ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెలుతున్న దంప‌తుల‌ను అనంత‌పురం జిల్లా గుత్తి మండ‌లం బాచుప‌ల్లికి చెందిన బాల‌రాజు(28), శ్రావణి(22), చిన్నారి అమ్ములు(8 నెల‌లు) గుర్తించారు. కారులో ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తిని వికారాబాద్ జిల్లా మ‌ర్ప‌ల్లి మండ‌లం ప‌ట్లూరు వాసి ఫ‌రీద్‌(25)గా గుర్తించారు. రోడ్డు ప్ర‌మాదం మృతుల కుటుంబాల్లో విషాదం నింపింది. కాగా.. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it