విషాదం.. ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారులు మృతి

Four children die of suffocation.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ పార్కు చేసిన కారులోకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2021 7:34 AM GMT
విషాదం..  ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారులు మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ పార్కు చేసిన కారులోకి ఎక్కిన పిల్ల‌లు ఉపిరిఆడ‌క మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బాగ్‌ప‌త్ జిల్లాలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. సింగౌలి గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఆడుకుంటున్నారు. అనిత్ త్యాగి అనే వ్య‌క్తి త‌న ఇంటి ముందు కారు పార్కింగ్ చేశాడు. ఆడుకుంటూ చిన్నారులు కారులోకి ఎక్కారు. ఆ స‌మయంలో కారు డోర్లు లాక్ అయ్యాయి. లోప‌ల ఊపిరిఆడ‌క చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కింద‌కు దిగే దారి లేక‌.. వారి ప‌రిస్థితిని ఎవ‌రూ గ‌మ‌నించ‌క‌పోవ‌డంతో.. న‌లుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఓ చిన్నారి మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. మృతిచెందిన చిన్నారులను నియతి (8), అక్షయ్‌ (4), వందన (4), క్రిష్ణ (7)లుగా గుర్తించారు. వీరితో పాటే కారులో ప్రవేశించిన శివాన్‌(8) మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కారు యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఇరుగుపొరుగు వారు ఆరోపిస్తున్నారు. ఊపిరి ఆడ‌క‌నే చిన్నారులు మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it