మైనర్‌ బాలికపై మారుతండ్రి అత్యాచారం.. గర్భవతి కావడంతో

Foster father sexually assaults minor girl, incident in Hyderabad. మహిళలు, చిన్నారులపై కామాంధులు దారుణాలకు తెగబడుతున్నారు. అదును కనిపిస్తే చాలు అన్నట్లుగా

By అంజి  Published on  14 March 2022 12:00 PM IST
మైనర్‌ బాలికపై మారుతండ్రి అత్యాచారం.. గర్భవతి కావడంతో

మహిళలు, చిన్నారులపై కామాంధులు దారుణాలకు తెగబడుతున్నారు. అదును కనిపిస్తే చాలు అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు కొందరు మానవ మృగాలు. వావి వరసలు, బంధుత్వాలు సైతం మరిచి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కనికరం లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్‌ నగర పరిధిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ పెంపుడు తండ్రి.. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక పీఎస్‌ పరిధిలోని మల్లంపేట్‌లో ఓ జంట గత 10 సంవత్సరాలు సహజీవనం చేస్తోంది.

వ్యక్తితో సహజీవనం చేస్తోన్న మహిళకు ఓ కూతురు ఉంది. ఈ క్రమంలోనే మైనర్‌ బాలికపై మారు తండ్రి కన్నేశాడు. తల్లికి తెలియకుండా మైనర్‌ బాలికను బలవంతంగా లోబర్చుకున్నాడు. ఆపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే కొన్ని రోజులుగా కూతురు ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో బాలికను తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. మైనర్‌ బాలిక గర్భవతి అని తేలింది. ఆ తర్వాత జరిగిన విషయం చెప్పడంతో తల్లి తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story