మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి క‌న్నుమూత‌.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీలో విషాదం నెల‌కొంది. మెట్‌ప‌ల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సతీమణి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో శుక్ర‌వారం బెంగళూరు హాస్పిటల్ లో మృతి చెందారు.

By Kalasani Durgapraveen  Published on  9 Nov 2024 6:48 AM IST
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి క‌న్నుమూత‌.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీలో విషాదం నెల‌కొంది. మెట్‌ప‌ల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సతీమణి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో శుక్ర‌వారం బెంగళూరు హాస్పిటల్ లో మృతి చెందారు.

కొమిరెడ్డి జ్యోతి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్య‌క్తం చేశారు. మలేషియా పర్యటనకు వెళుతూ ఎయిర్‌పోర్టు నుంచి జ్యోతి దేవి కుమారుడు కొమిరెడ్డి కరమ్ కి ఫోన్ చేసి మరణ వార్త వివరాలు ఆడిగి తెలుసుకొని పరామర్శించి తన సానుభూతిని తెలియ‌జేశారు. కొమిరెడ్డి జ్యోతి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆయన భగవంతుణ్ణి ప్రార్థించారు.

1998లో మెట్ పల్లి స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కొమిరెడ్డి జ్యోతి విజ‌యం సాధించింది. అనంత‌రం 2004 ఎన్నిక‌ల్లో ఆమె భ‌ర్త కొమిరెడ్డి రాములు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు

Next Story