మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత‌

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో మంగళవారంఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు

By Kalasani Durgapraveen  Published on  5 Nov 2024 10:27 AM IST
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత‌

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో మంగళవారంఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున 1999 వ‌ర‌కూ నాలుగుసార్లు వరుసగా గెలుపొందారు. ఆయన పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. 2004లో ఆయ‌న ప్ర‌స్తుత వైసీపీ నేత‌, అప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కుడైన క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ చేతిలో ఓడిపోయారు. రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ప‌లు పార్టీల నేతలు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు బుధ‌వారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

Next Story