అమానుషం.. పోలీస్ స్టేష‌న్‌కు పిలిచి మూత్రం తాగించిన ఎస్సై

Forced to drink urine by police. స్సై త‌న‌ను స్టేష‌న్‌కు పిలిపించి బ‌ల‌వంతంగా మూత్రం తాగించార‌డ‌ని ఓ ద‌ళిత యువ‌కుడు ఆరోపించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 May 2021 1:20 AM GMT
Polica makes man drink urine

ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి.. ఓ వ్య‌క్తి ప‌ట్ల స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ప్ర‌వ‌ర్తించాడు. ఎస్సై త‌న‌ను స్టేష‌న్‌కు పిలిపించి బ‌ల‌వంతంగా మూత్రం తాగించార‌డ‌ని ఓ ద‌ళిత యువ‌కుడు ఆరోపించారు. ఈ అమానుష ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. చిక్కమగళూరు తాలూకా మూడిగెరెలో మే 10 న జరిగిగిన ఈ అమానవీయ ఘటన దాదాపు రెండు వారాల తరువాత వెలుగులోకి వచ్చింది.


ఓ మహిళ మిస్సింగ్‌ కేసులో గోనిబీదు ఎస్‌ఐ అర్జున్‌ దళిత వర్గానికి చెందిన పునిత్‌ అనే యువకున్ని స్టేషన్‌కు పిలిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి నేరం ఒప్పుకోవాలని బలవంతం చేశాడు. అసభ్య పదజాలంతో తిడుతూ, తాగడానికి నీళ్లు అడిగితే కోపంతో మూత్రం తాగించాడు. దాదాపు 6 గంట‌ల పాటు చిత్ర‌హింస‌లు పెట్టాడని ఆ ద‌ళిత యువ‌కుడు ఆరోపించాడు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ళిత సంఘాలు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశాయి. ఎస్సై అర్జున్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు తెలిపిన చిక్క‌మ‌గ‌ళూరు ఎస్పీ అక్ష‌య్‌.. అర్జున్‌ను బ‌దిలీ చేశామ‌ని వెల్ల‌డించారు. ఇలాంటి ఘటనలు అమానవీయమని కాంగ్రెస్ నేత దినేశ్​ గుండూరావు ట్వీట్​ చేశారు. ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story
Share it