ఒకే ఇంట్లో ఐదు శవాలు.. హత్యనా..? ఆత్మహత్యనా..?
Five members of family found dead at home in chhattisgarh .. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శవాలై కనిపించడం కలకలం
By సుభాష్ Published on 17 Nov 2020 2:17 PM IST
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శవాలై కనిపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా శవాలై కనిపించడంతో హత్య చేశారా..? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సమాచారం మేరకు.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా మరో ముగ్గురున్నారు. మృతులు కమలేష్ సాహు (34), భార్య ప్రమిల (30), కమలేష్ తల్లి లలితా బాయి (60), కుమార్తె కీర్తి (11), కుమారుడు నరేంద్ర (6)గా గుర్తించినట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అజయ్ యాదవ్ తెలిపారు.
అయితే వీరిది ఆత్మహత్య..? హత్యా అనేది విషయం ఇంకా తెలియలేదన్నారు. ఇద్దరు పిల్లలతో సహా తల్లి, భార్యను కమలేష్ చంపి, తర్వాత ఉరివేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిచామని, అలాగే ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అలాగే వీరి మృతిపై పూర్తి ఆధారాలు సేకరించాలని ఛత్తీస్‌గఢ్ హోంశాఖ మంత్రి తమరాధ్వాజ్ సాహు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే కుటుంబం ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.