ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి గరియాబంద్ జిల్లాలో జోబా వద్ద వేగంగా వెలుతున్న ట్రక్కు.. ట్రాక్టర్ ట్రాలీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. ఓ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి ట్రాక్టర్ ట్రాలీలో వెలుతుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.