న‌ల్ల‌గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాలు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Five died in Different Accidents in Nalgonda district.న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన రెండు వేర్వేరు ప్ర‌మాదాల్లో ఐదుగురు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sept 2021 11:58 AM IST
న‌ల్ల‌గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాలు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన రెండు వేర్వేరు ప్ర‌మాదాల్లో ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. క‌ట్టంగూరు మండ‌లం ముత్యాల‌మ్మ‌గూడెం శివారులో ఈ ప్ర‌మాదాలు జ‌రిగాయి. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెలుతున్న ఓ కారు కంటైన‌ర్ ఢీకొట్టింది. అదుపు త‌ప్పి రోడ్డు పక్క‌నే ఉన్న చెట్లును ఢీకొని ఆగింది. ఈ ప్ర‌మాదంలో కారుల ప్ర‌యాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

మ‌రో ఘ‌ట‌న‌లో ఆగి ఉన్న‌లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. ప్ర‌ధాన హైవే ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో కాసేపు జాతీయ ర‌హ‌దారిపై ట్రాఫిక్ స్తంబించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. కాగా.. ఈ ప్ర‌మాదం పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story