బస్సుకు తగిలిన హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు.. ముగ్గురు దుర్మరణం

Fire on bus on Jaipur-Delhi highway.. ఓప్రైవేటు బస్సుకు హైటెన్షన్ విద్యుత్‌ తీగలు తగలడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

By సుభాష్  Published on  28 Nov 2020 3:05 AM GMT
బస్సుకు తగిలిన హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు.. ముగ్గురు దుర్మరణం

ఓప్రైవేటు బస్సుకు హైటెన్షన్ విద్యుత్‌ తీగలు తగలడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీ నుంచి జైపూర్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు విద్యుత్‌ తీగలు తగలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లాబానా సమీపంలో ఒక టక్కు బోల్తా పడటంతో జైపూర్‌ - ఢిల్లీ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ప్రైవేటు బస్సు డ్రైవర్‌ తన బస్సును రాంగ్‌ రూట్‌లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సుకు హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగినట్లు స్థానిక పోలీసు అధికారి అనితా మీనా తెలిపారు.

బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం కారణంగా బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు మేల్కొని ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

Next Story