ముంబై-హైదరాబాద్ హైవేపై తగలబడ్డ కార్లు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఆదివారం కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో భారీ మంటలు చెలరేగడంతో అపార నష్టం జరగడంతో పాటు హైదరాబాద్-ముంబై హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది.

By Kalasani Durgapraveen
Published on : 10 Nov 2024 8:30 PM IST

ముంబై-హైదరాబాద్ హైవేపై తగలబడ్డ కార్లు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఆదివారం కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో భారీ మంటలు చెలరేగడంతో అపార నష్టం జరగడంతో పాటు హైదరాబాద్-ముంబై హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది.

ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కంటైనర్‌లోని ఎనిమిది కార్లు తగలబడ్డాయి. రన్జోల్ వద్ద ఈ ఘటన జరిగింది. కంటైనర్ నుండి దట్టమైన నల్లటి పొగలు ఎగసిపడ్డాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు ప్రయత్నించినప్పటికీ, మంటల తీవ్రత కారణంగా కార్లు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా రద్దీగా ఉండే హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎటువంటి ప్రాణనష్టం జరకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.

Next Story