ఉట్నూరు మ‌ద్యం డిపోలో భారీ అగ్నిప్ర‌మాదం

Fire accident Wine Depot in Utnoor.ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మ‌ద్యం డిపోలో బుధ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 10:36 AM IST
ఉట్నూరు మ‌ద్యం డిపోలో భారీ అగ్నిప్ర‌మాదం

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మ‌ద్యం డిపోలో బుధ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఉట్నూరు క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మ‌ద్యం డిపోలో షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి డిపో మొత్తం వ్యాపించాయి. దీంతో భారీగా మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నారు. రూ.కోట్ల‌లో ఆస్తిన‌ష్టం జ‌రిగిన‌ట్లు అధికారులు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డుతుండ‌డంతో అక్క‌డ ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది. మంట‌లు అదుపులోకి వ‌స్తే గానీ ఎంత న‌ష్టం వాటిల్లింద‌నే స‌మాచారం తెలుస్తుంది. కాగా.. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story