సిద్దిపేట జిల్లాలో విషాదం.. వృద్ద దంప‌తుల స‌జీవ ద‌హ‌నం

Fire accident in siddipet.సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ద దంప‌తులు స‌జీవ ద‌హ‌నం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 5:41 AM GMT
fire accident in Siddipet

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ద దంప‌తులు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. వివ‌రాల్లోకి వెళితే.. కొహెడ మండ‌లంలోని తంగ‌ళ్ల‌ప‌ల్లి గ్రామంలో యాద న‌ర్స‌య్య (80), ల‌చ్చ‌మ్మ (70) దంప‌తులు నివ‌సిస్తున్నారు. రోజులాగే నిన్న రాత్రి కూడా నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. అర్థ‌రాత్రి స‌మ‌యంలో వారు నివ‌సిస్తున్న పూరి గుడిసెకు మంట‌లు అంటుకున్నాయి. పూరి గుడిసె కావ‌డంతో మంట‌లు వేగంగా వ్యాపించాయి.

వృద్దులు కావ‌డంతో వారు బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. రాత్రి స‌మ‌యం కావ‌డంతో మంట‌లు అంటుకున్న స‌మ‌యంలో ఎవ‌రూ చూడ‌క‌పోవ‌డంతో వారిద్ద‌రు మంట‌ల్లో స‌జీవ ద‌హ‌నం అయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి.. పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు అనుమానిస్తున్నారు.


Next Story