నర్సీపట్నంలో అగ్నిప్ర‌మాదం.. తండ్రీ, కొడుకు మృతి

Fire Accident in Narsipatnam Father and Son died.అగ్ని ప్ర‌మాదంలో తండ్రీ, కొడుకు మృతి చెందిన‌ విషాద ఘ‌ట‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2022 12:37 PM IST
నర్సీపట్నంలో అగ్నిప్ర‌మాదం.. తండ్రీ, కొడుకు మృతి

అగ్ని ప్ర‌మాదంలో తండ్రీ, కొడుకు మృతి చెందిన‌ విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన‌కాప‌ల్లి జిల్లా న‌ర్సీప‌ట్నంలో చోటు చేసుకుంది.

కృష్ణాబ‌జార్‌లో మల్లేశ్వరరావు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. భ‌వ‌నంలోని పై అంత‌స్తులో వీరు ఉంటుండ‌గా.. కింద అంబికా జ్యూయలర్స్ షాపును నిర్వ‌హిస్తున్నారు. ఆదివారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల ప్రాంతంలో అంబికా జ్యూయలరీ షాపు మేడ‌పైన మంట‌లు చెల‌రేగాయి. మంట‌లు భ‌వ‌నం మొత్తం వ్యాపించాయి.

మ‌ల్లేశ్వ‌రావు త‌న సోద‌రుడికి ఫోన్ చేసి ప్ర‌మాదం గురించి చెప్పాడు. సోద‌రుడు అక్క‌డ‌కు చేరుకునే స‌రికే ద‌ట్టంగా పొగ‌లు అలుముకున్నాయి. మంట‌లు, పొగ కార‌ణంగా ఊపిరి ఆడ‌క మ‌ల్లేశ్వ‌ర‌రావు, ఆయ‌న కుమారుడు మౌలేష్ ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకు వ‌చ్చారు. మ‌ల్లేశ్వ‌రరావు భార్య‌, కుమార్తెకు తీవ్ర గాయాలు కావ‌డంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథమికంగా అంచ‌నా వేస్తున్నారు.

Next Story