టెక్స్‌టైల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బందిపై కూలిన భవనం.. ఇద్దరు మృతి

Fire Accident In Madurai Textile ..తమిళనాడులోని మధురైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ‌

By సుభాష్  Published on  14 Nov 2020 6:55 AM GMT
టెక్స్‌టైల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బందిపై కూలిన భవనం.. ఇద్దరు మృతి

తమిళనాడులోని మధురైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విలక్కుతున్‌ సమీపంలో ఉన్న నవబతత్కన వీధిలోని టెక్స్‌టైల్స్‌ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే షాపు కొనసాగుతున్నది పాత భవనం కావడంతో మంటలు ఆర్పుతుండగా భవనం ఒక్కసారిగా కూలింది.

ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది శివరాజన్‌, కృష్ణమూర్తికి గాయాలయ్యాయి. వీరు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. గమనించిన మిగతా సిబ్బంది వారికి వెలికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివరాజన్, కృష్ణమూర్తి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వీరితో పాటు మరో ఇద్దరు ఫైర్‌ సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు ఫైర్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

Next Story
Share it