బంజారాహిల్స్‌లో కాలి బూడిదైన కార్లు

బంజారాహిల్స్‌లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు

By Medi Samrat  Published on  20 Jan 2024 6:13 PM IST
బంజారాహిల్స్‌లో కాలి బూడిదైన కార్లు

బంజారాహిల్స్‌లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ 4లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని మూడు కార్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న మూడు కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story