లూడో తీసిన ప్రాణం
Fight for money while playing ludo game.లూడో గేమ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గేమ్ విషయంలో ఇద్దరు
By తోట వంశీ కుమార్ Published on
5 Sep 2021 7:40 AM GMT

లూడో గేమ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గేమ్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరుగగా.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని పాతబస్తీలోని మంగళ్‌హాట్ గుప్ఫానగర్‌లో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున హానీఫ్, హాజీ అనే ఇద్దరు యువకులు లూడో గేమ్ ఆడారు. నగదు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగగింది. ఈ క్రమంలో ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో హానీఫ్ అక్కడిక్కడే మృతి చెందగా.. హాజీకి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హాజీని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story