కుమారైతో స‌హా తండ్రి ఆత్మ‌హ‌త్య‌.. 'తాను చ‌నిపోతే కుమారైను భార్య స‌రిగ్గా చూసుకోద‌ని'

Father Suicide with his daughter by jumping from building in Yadagirigutta.ఓ తండ్రి, త‌న ఆరేళ్ల కుమారైతో క‌లిసి హోట‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2022 1:31 PM IST
కుమారైతో స‌హా తండ్రి ఆత్మ‌హ‌త్య‌.. తాను చ‌నిపోతే కుమారైను భార్య స‌రిగ్గా చూసుకోద‌ని

ఓ తండ్రి, త‌న ఆరేళ్ల కుమారైతో క‌లిసి హోట‌ల్ బిల్డింగ్ పై నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలోనే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటులో రాసి ఉంది. తాను చ‌నిపోతే.. త‌న కుమారైను భార్య స‌రిగ్గా చూసుకోద‌ని, అందుక‌నే కుమారైను కూడా త‌న‌తో పాటు తీసుకుపోతున్న‌ట్లు అందులో రాసి ఉంది. ఈ ఘ‌ట‌న యాద‌గిరిగుట్ట‌ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌లో చెరుకూరి సురేష్(40).. భార్య, ఆరేళ్ల కుమారై శ్రేష్ఠ‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. గురువారం ఉద‌యం త‌న కుమారైని తీసుకొని యాదాద్రి శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారి ద‌ర్శించుకునేందుకు యాద‌గిరి గుట్ట వ‌చ్చారు. స్థానికంగా ఉన్న మ‌యూరి లాడ్జ్‌లో గ‌దిని అద్దెకు తీసుకున్నారు. కాగా.. అర్థ‌రాత్రి స‌మ‌యంలో హోట‌ల్ బిల్డింగ్‌పై నుంచి కుమారైతో క‌లిసి కింద‌కు దూకేశాడు సురేష్‌.

గ‌మ‌నించిన స్థానికులు, హోట‌ల్ సిబ్బంది వారి వ‌ద్ద‌కు వెళ్లి చూడ‌గా అప్ప‌టికే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న‌పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లంలో సూసైడ్ నోటు ల‌భ్య‌మైంది. మృతుడు బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యంలో స‌బ్ డివిజిన‌ల్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు గుర్తించారు. కుటుంబ క‌ల‌హాల‌తోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు లేఖ‌లో తెలిపాడు. తాను చ‌నిపోతే.. త‌న కుమారైను భార్య స‌రిగ్గా చూసుకోద‌నే కార‌ణంగా కుమారైతో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అందులో పేర్కొన్నాడు.

Next Story