రెస్టారెంట్‌లో ఎక్స్‌ట్రా సాంబార్‌ కోసం.. వ్యక్తిని కొట్టి చంపిన తండ్రీకొడుకులు

చెన్నైలోని ఓ రెస్టారెంట్‌లో అదనపు సాంబార్‌పై గొడవ బుధవారం హింసాత్మకంగా మారడంతో ఒక వ్యక్తిని చంపినందుకు తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు.

By అంజి
Published on : 14 March 2024 1:11 AM

Chennai, Crime news, restaurant, extra sambhar

రెస్టారెంట్‌లో ఎక్స్‌ట్రా సాంబార్‌ కోసం.. వ్యక్తిని కొట్టి చంపిన తండ్రీకొడుకులు

చెన్నైలోని ఓ రెస్టారెంట్‌లో అదనపు సాంబార్‌పై గొడవ బుధవారం హింసాత్మకంగా మారడంతో ఒక వ్యక్తిని చంపినందుకు తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు. అరుణ్ (30) అనే వ్యక్తి చెన్నైలోని పల్లవరంలోని పమ్మల్ మెయిన్ రోడ్‌లోని అడయార్ ఆనంద భవన్ రెస్టారెంట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శంకర్ (55), అతని 30 ఏళ్ల కుమారుడు అరుణ్ కుమార్ రెస్టారెంట్‌కు వెళ్లి ఆహారాన్ని పార్శిల్ చేయమని కోరారు. ఇదే సమయంలో వారు అదనపు సాంబార్ కోరగా, రెస్టారెంట్ సిబ్బంది నిరాకరించారు.

గొడవ జరిగి తండ్రీకొడుకులిద్దరూ రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డును కొట్టారు. అరుణ్ గొడవ ఆపేందుకు ప్రయత్నించగా తండ్రీకొడుకులు దాడి చేశారు. అరుణ్ కిందపడి స్పృహ కోల్పోయాడు. అతడిని క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శంకర్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.

Next Story