భార్యపై అనుమానం.. కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తండ్రి
Father Poured kerosene his son and set him fire in Tirupati District.భార్యా భర్తల బంధం అంటే అన్యోన్యత కు కేరాఫ్ అడ్రస్
By తోట వంశీ కుమార్ Published on 12 July 2022 8:54 AM ISTభార్యా భర్తల బంధం అంటే అన్యోన్యత కు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. కానీ ఇటీవలి కాలం లో మాత్రం భార్యా భర్తల బంధంలో అన్యోన్యత కాదు అనుమానాలు, మనస్పర్థలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంత మంది భార్యా భర్తల బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న భార్యపై అనుమానం తో దారుణాలకు పాల్పడుతున్నారు. భార్యపై అనుమానంతో ఓ భర్త ఏకంగా కన్న కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వడమాలపేట బట్టీకండ్రిగ హరిజనవాడలో రమేష్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యపై అనుమానంతో రమేష్ గత కొద్ది రోజులుగా ఆమెను వేదిస్తున్నాడు.ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఆమె కనబడకపోవడంతో తనపై పోలీస్ కంప్లైట్ ఇవ్వడానికే వెళ్లిందని అనుమానించాడు. దీంతో భార్యపై కోపాన్ని కుమారుడిపై చూపాడు.
కొడుకు మహేష్(9)కు ఫినాయిల్ తాగించాడు. బాలుడి అమ్మమ్మ వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లింది. చికిత్స అందించిన వైద్యులు బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపడంతో అతడికి ఇంటికి తీసుకువచ్చింది. రాత్రి అయిన సరే భార్య ఇంటికి రాకపోవడంతో రమేష్.. కుమారుడు మహేష్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాలుడి కేకలు విన్న పక్కంటి వారు వెంటనే అక్కడకు వచ్చి మంటలు ఆర్పి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహేష్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి.