వ‌న‌ప‌ర్తి జిల్లాలో దారుణం.. కూతురిని న‌రికి చంపిన తండ్రి

Father kills Daughter in Wanaparthy District. కుమారైను న‌రికి హ‌త్య చేశాడో తండ్రి. ఈ దారుణ ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 9:25 AM IST
వ‌న‌ప‌ర్తి జిల్లాలో దారుణం.. కూతురిని న‌రికి చంపిన తండ్రి

బిడ్డ‌ల‌కు చిన్న క‌ష్టం వ‌స్తేనే త‌ల్లడిల్లిపోతుంటారు త‌ల్లిదండ్రులు. వారికి ఏ క‌ష్టం రానీయ‌కుండా త‌మ‌కు ఉన్న‌దాంట్లో కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌స్తుంటారు. అలాంటిది.. కుమారైను న‌రికి హ‌త్య చేశాడో తండ్రి. ఈ దారుణ ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.పెబ్బేరు మండ‌లం పాత‌ప‌ల్లి గ్రామంలో బోయ రాజశేఖ‌ర్, సునీత దంప‌తులు వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. వీరికి ఇద్ద‌రుకు కుమారైలు, కుమారుడు సంతానం. చిన్న కూతురు గీత‌(15) ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువ‌కుడితో బాలిక ప్రేమ‌లో ఉన్న‌ట్లు తండ్రి రాజశేఖ‌ర్ గుర్తించాడు. కుటుంబం ప‌రువు తీయ‌వ‌ద్ద‌ని, బుద్దిగా చ‌దువుకోవాల‌ని ప‌లుమార్లు మంద‌లించాడు.

అయిన‌ప్ప‌టికి గీత ఇవేవీ ప‌ట్టించుకోకుండా త‌న ప్రేమ‌ను కొన‌సాగిస్తోంది. మంగ‌ళ‌వారం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో తండ్రి, కుమారైకు ఈ విష‌య‌మై మ‌రోమారు గొడ‌వ జ‌రిగింది. తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన రాజ‌శేఖ‌ర్.. ప‌క్క‌నే ఉన్న ప‌దునైన ఆయుధంతో గీత‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన గీత అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. అనంత‌రం శ్రీనివాస్ పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయిన‌ట్లు స‌మాచారం.

ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌రలించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సొంత కూతురిని తండ్రి హత్య చేయడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.

Next Story