కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడ‌ని.. కోడలిని అమ్మేసిన మామ‌

Father in law sold his daughter in law.పుట్టింటిని వ‌దిలి మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడలిని కూతురిలా చూసుకోవాలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 1:32 AM GMT
కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడ‌ని.. కోడలిని అమ్మేసిన మామ‌

పుట్టింటిని వ‌దిలి మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడలిని కూతురిలా చూసుకోవాలి మామ. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఓ తండ్రిలా ఆదరించాలి. ఎప్పుడైనా కొడుకు కోప్పడిన సర్ది చెబుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఒక మామ మాత్రం నీచానికి ఒడిగట్టాడు. త‌న కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడ‌ని కోడలని ఏకంగా అంగట్లో అమ్మకానికి పెట్టేసాడు. కొడుకు కు తెలియకుండా కోడలని అమ్మేశాడు. సభ్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది

గుజ‌రాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయాన్ని బ్రోకర్ల సహాయంతో తెలుసుకున్నాడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాంకిలో ఉంటున్న చంద్ర‌రామ్ అనే వ్యక్తి. ఈ క్రమంలోనే అతనికి డబ్బు ఆశ కలిగింది. ఇక ఇంట్లో ఉన్న కోడలని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. రూ.80వేల‌కు బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.40వేలు తీసుకున్నాడు. అందులోంచి రూ.20వేల‌ను త‌న కొడుకు ప్రిన్స్ బ్యాంకు ఖాతాకు పంపించాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్‌ తండ్రిని అడగగా, ఏదోలా నచ్చచెప్పి.. ఆరోగ్యం సరిగాలేదని తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు.

తండ్రి మాటలను నిజ‌మేన‌ని న‌మ్మిన ప్రిన్స్.. త‌న భార్య‌ను జూన్ 4న బారంకిలో ఉంటున్న తండ్రి వ‌ద్ద‌కు పంపాడు. జూన్‌ 5 సాయంత్రం చందరామ్‌ తనకి ఆరోగ్యం కుదుట పడిందని ఇంటికి వెళ్లమని కోడలికి చెప్పాడు. త‌న స్నేహితుడు ఇంటి దగ్గర దింపుతాడ‌ని కోడలితో నమ్మబలకడంతో ఆమె బ్రోకర్‌తో వెళ్లింది. తన సమీప బంధువు ద్వారా తండ్రి నిర్వాకం తెలుసుకున్న ప్రిన్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలితో కలిసి గుజరాత్‌కు వెళ్లేందుకు బారబంకి రైల్వే స్టేషన్‌లో సిద్ధంగా ఉన్న ప‌లువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన 8 మంది నిందితుల్లో ముగ్గురుమ‌హిళ‌లు కూడా ఉన్నారు. ప‌రారీలో ఉన్న ప్ర‌ధాన‌నింధితుడు, బాధితురాలి మామ‌గారైన చంద్ర‌రామ్ స‌హా మ‌రో నిందితుడు రాము గౌత‌మ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా ఇప్ప‌టి వ‌ర‌కు 300 మంది మ‌హిళ‌ల‌ను కొనుగోలు చేసి వారిని వివిధ వ్య‌క్తుల‌కు విక్ర‌యించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాన నిందితుడు చంద్ర‌రామ్ ఓ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు.

Next Story