కొడుకు మ‌ర‌ణించ‌గా.. కోడ‌లిపై క‌న్నేసిన మామ‌.. కాద‌న్నందుకు హత్యాయత్నం

Father in law Gets Evil Eye On Dead Son's Wife.తండ్రి త‌రువాత తండ్రి లాంటి వాడు మామ‌. భ‌ర్త‌ను కోల్పోయి పుట్టెడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 7:53 AM GMT
కొడుకు మ‌ర‌ణించ‌గా.. కోడ‌లిపై క‌న్నేసిన మామ‌.. కాద‌న్నందుకు హత్యాయత్నం

తండ్రి త‌రువాత తండ్రి లాంటి వాడు మామ‌. భ‌ర్త‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న‌ కోడలిని కుమారైగా చూసుకోవాల్సింది పోయి ఆమెపై క‌న్నేశాడు. కొడుకు చ‌నిపోయాడు అన్న బాధ ఏమాత్రం లేకుండా అత్యంత దారుణానికి ఒడిగ‌ట్టాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోడలిని వేదించేవాడు. త‌న మాట‌ను నిరాక‌రించ‌డంతో ఆమెపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. చింతకాని మండలం రైల్వే కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకి సోదరి కూతురితో వివాహం చేశాడు. వీరికి ముగ్గురు పిల్ల‌లు సంతానం. కాగా.. మూడేళ్ల క్రితం అత‌డి కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కోడ‌లు, ఆమె పిల్ల‌లు ఒంట‌రిగా మిగిలారు. దీన్నిఆస‌రాగా చేసుకున్న మామ‌.. ఎంత‌కాలం ఒంట‌రిగా ఉంటావ‌ని కోడ‌లిని వేదించ‌డం మొద‌లుపెట్టాడు. త‌న కోరిక తీర్చాల‌ని, త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని బ‌ల‌వంతం పెట్టేవాడు. ఈ విష‌యాన్ని బాధితురాలు త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌గా ఇరు కుటుంబాల మ‌ధ్య మంగ‌ళ‌వారం గొడ‌వ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో ఆగ్ర‌హానికి లోనైన మామ‌.. కోడ‌లిని క‌త్తితో పొడిచేందుకు యత్నించాడు. బాధితురాలి త‌ల్లి అడ్డుప‌డ‌గా.. ఆమెకు రెండు చోట్ల క‌త్తిగాయాలు అయ్యాయి. వెంట‌నే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కోడ‌లు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it