యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 42 మందికి గాయాలు

Fatal road accident in UP.. 4 killed, 42 injured. ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటావా సమీపంలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారుజామున

By అంజి  Published on  23 Oct 2022 9:46 AM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 42 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటావా సమీపంలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారుజామున కంటైనర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 42 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ సైఫాయి మెడికల్ కాలేజీలో చేర్పించారు. క్షతగాత్రులందరికీ సరైన సహాయం అందించి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

తెలిసిన ప్రకారం వివరాల ప్రకారం.. బస్సు గోరఖ్‌పూర్ నుండి అజ్మీర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులను శ్రేయ (7), హమీద్ అలీ (35), సుమేర్ సింగ్ గుజ్జర్ (52), సోను చతుర్వేది (32)గా గుర్తించినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Next Story