నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం.. లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎం వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం నాడు ఉదయం మక్తల్ మండలం బొందలకుంట రోడ్డుపై జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. బుల్లెట్ బండిపై వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. నడకుదురు, పెనుగుదురు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై వెళుతున్న వీరేంద్ర తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.