Hyderabad: స్నేహితుడి కూతురిపై లైంగిక దాడి.. నిందితుడికి కఠిన కారాగార శిక్ష

పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలో స్నేహితుడి కూతురి మీద లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పోక్సో చట్టం కింద కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

By అంజి
Published on : 4 April 2025 3:36 PM IST

Fast-track court, imprisonment, assaulting, friend daughter, Crime

Hyderabad: స్నేహితుడి కూతురిపై లైంగిక దాడి.. నిందితుడికి కఠిన కారాగార శిక్ష

హైదరాబాద్‌: పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలో స్నేహితుడి కూతురి మీద లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పోక్సో చట్టం కింద కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన అనారోగ్య కారణాల వల్ల తాత్కాలికంగా తన కూతురి సంరక్షణను కొన్ని రోజులు అతని స్నేహితుడికి అప్పగించాడు. అయితే సదరు స్నేహితుడు ద్రోహ బుద్ధితో ఆ బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వృత్తి రీత్యా ఆటో డ్రైవర్‌ అయిన నిందితుడు సయ్యద్ హాజీ అలీని అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా ఈ కేసు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించింది. సయ్యద్ హాజీని కోర్టు దోషిగా నిర్ధారించింది. పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 420,363,376 IPC, section 3&4 ఆఫ్ పోక్సో చట్టం, పహడిషరీఫ్ స్టేషన్ SC NO 614/2022, అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి.. నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.15,000/- జరిమానా విధించబడింది. బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, డి.రఘు వాదనలు వినిపించారు.

Next Story