కర్నూలులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
Family commits suicide in kurnool.కర్నూలు నగరంలో విషాదం చోటు చేసుకుంది. వడ్డేగిరిలో ఒకే కుటుంబంలోని
By తోట వంశీ కుమార్ Published on 23 Jun 2021 6:30 AM GMT
కర్నూలు నగరంలో విషాదం చోటు చేసుకుంది. వడ్డేగిరిలో ఒకే కుటుంబంలోని నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరంలోని వడ్డేగిరిలో ప్రతాప్(42) హేమలత(36) దంపతులు నివసిస్తున్నారు. వీరికి జయంత్(17), రిషిత(14) సంతానం. కాగా.. మహేష్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఎంతసేపు అయినప్పటికి కూడా వారి ఇంటి తలుపు తెరవలేదు.
దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తలుపులు పగుల కొట్టి లోపలికెళ్లగా.. నలుగురు విగతజీవులై కనిపించారు. మంగళవారం రాత్రి వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. అక్కడ లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో కరోనా మహమ్మారి కారణంగా బంధువులు, స్నేహితులు చనిపోయారని.. మనస్తాపంతో తాము విషం తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.