ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్‌దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను గల్ఫ్ నుంచి ముంబైకి రాగా ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎంఎన్‌సీ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో చేసిన రూ.850 కోట్ల స్కామ్‌లో అమర్‌దీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు అమర్ దీప్ కొట్టేశాడు. ఎంఎన్‌సీ కంపెనీలో పెట్టుబడుల పేరుతో అమర్ దీప్ డబ్బులు వసూలు చేశాడు. యాప్ బేసిడ్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో స్కాం చేశాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ బురిడీ కొట్టించాడు. ఆ తర్వాత ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ దంపతులు దుబాయ్ కి చార్టెడ్ ఫ్లైట్‌లో పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సీఈఓ తో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.