నకిలీ డాక్టర్‌గా అవతారం.. ఆ తర్వాత క్షుద్రపూజలు..!

ఓ వ్యక్తి ఒకవైపు నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతూనే.. మరోవైపు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడు.

By Srikanth Gundamalla  Published on  24 Sep 2023 12:30 PM GMT
Fake doctor, Arrested, Black Magic, Hyderabad, LB Nagar,

నకిలీ డాక్టర్‌గా అవతారం.. ఆ తర్వాత క్షుద్రపూజలు..!

టెక్నాలజీ ఎంతగా పెరిగినా కూడా కొంతమంది మూర్ఖంగా క్షుద్ర పూజలను నమ్ముతూ ఉంటారు. అటువంటి వారినే టార్గెట్గా చేసుకొని కేటుగాళ్లు పూజలు చేస్తే మంచి జరుగుతుందని చెప్పి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు నగరంలో ఫేక్ డాక్టర్లు పుట్టగొడుగుల్లాగా పెరిగి పోతున్నారు. ఓ వ్యక్తి ఒకవైపు నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతూనే.. మరోవైపు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడు.

ఎల్బీనగర్లోని ఓ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారం రావడంతో వెంటనే ఎస్ఓటి బృందం రంగంలోకి దిగి ఆ ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వైద్యం పేరుతో ఫేక్ డాక్టర్ గా చలామణి అవుతున్నాడని గుర్తించారు. నార్త్ ఇండియన్ అయినా ఇతను హైదరాబాదు నగరానికి వచ్చి గత రెండు సంవత్సరాలుగా GNR ఆయుర్వేదం పేరుతో హాస్పటల్ రన్ చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు తెలిపారు. వైద్యం కోసం అతని వద్దకు వచ్చిన వారికి చేతబడి చేశారంటూ నమ్మించే వాడు. తాను పూజలు చేస్తే తిరిగి మామూలు మనిషి అవుతారని నమ్మించి.. వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ లోని ఓ ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో వెంటనే ఎస్ఓటి బృందం అతని అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుండి భారీగా పూజా సామాగ్రి , సెల్ ఫోన్, ఒక వాహన స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆస్పత్రిని కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఫేక్ డాక్టర్ క్షుద్రపూజల ఖాతాలో పలువురు విఐపీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సిసి పుటేజ్ హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారమే తుహీర్ కుమార్ మండల్ (30) అనే ఒక ఫేక్ డాక్టర్‌ను అరెస్టు చేశారు.

Next Story