తల్లి సాయంతో.. తండ్రిని ఆరు ముక్కలుగా నరికిన కొడుకు.. ఆపై

Ex Navy Man killed by wife and son body chopped into 6 parts. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని కుదిపేసిన కొన్ని రోజుల తర్వాత కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని బరుయ్‌పూర్‌లో

By అంజి  Published on  21 Nov 2022 2:11 AM GMT
తల్లి సాయంతో.. తండ్రిని ఆరు ముక్కలుగా నరికిన కొడుకు.. ఆపై

ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని కుదిపేసిన కొన్ని రోజుల తర్వాత కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని బరుయ్‌పూర్‌లో ఇలాంటి దారుణ హత్య మరొకటి తెరపైకి వచ్చింది. మాజీ నేవీ వ్యక్తిని 50 ఏళ్ల మహిళ, ఆమె 25 ఏళ్ల కొడుకు కలిసి హత్య చేశారు. ఆ వ్యక్తి శరీరాన్ని ఆరు భాగాలుగా నరికి సమీపంలోని ప్రాంతాలలో పడేశాడు. బాధితుడు 55 ఏళ్ల ఉజ్వల్ చక్రవర్తి, నేవీ మాజీ సిబ్బంది. కుమారుడి పరీక్ష ఫీజు రూ. 3,000 చెల్లించే విషయంలో గొడవపడి నవంబర్ 14 సాయంత్రం అతని భార్య శ్యామాలి చక్రవర్తి, కుమారుడు రాజు చక్రవర్తి అలియాస్ జాయ్‌లు హత్య చేశారని పోలీసులు తెలిపారు.

''ఇప్పటివరకు మా దర్యాప్తులో ఉజ్జావల్ మద్యం సేవించి గొడవ చేసేవాడని తేలింది. నవంబర్ 14 సాయంత్రం భార్యతో గొడవపడి కొడుకుపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే ఆవేశంతో రాజు తన తండ్రిని గొంతు నులిమి చంపాడు'' అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బరుయిపూర్) పుష్ప తెలిపారు. ఐటీఐ నుంచి పాలిటెక్నిక్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్న కొడుకు కార్పెంటరీ క్లాస్ కిట్‌లోని హ్యాక్‌సాతో మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు తెలిపారు.

ఉజ్జ్వల్ మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, అతని కుమారుడు వాటిని సమీపంలోని చెరువు , పొదల్లో పారవేసాడని, శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి పడేశాడని పోలీసు అధికారి తెలిపారు. ఖాస్ మల్లిక్, దేహిమెదన్ మల్లా ప్రాంతాల్లో శరీర భాగాలను పడవేయడానికి కొడుకు తన సైకిల్‌పై కనీసం ఆరు ట్రిప్పులు చేశాడని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు శరీర భాగాలను తొలగించిన తర్వాత భార్య, కొడుకు.. ఒక ప్రైవేట్ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఉజ్వల్ ఇంటికి తిరిగి రాలేదని, అదృశ్యమైన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు.

రెండు రోజుల తర్వాత నవంబర్ 17న సమీపంలోని చెరువులో శరీర భాగాలు తేలడం ప్రారంభించాయి. ''గురువారం సాయంత్రం, నేను మా ఇంటి పై అంతస్తులో కూర్చున్నప్పుడు, చెరువులో ఎర్రటి టీ షర్టు తేలుతూ కనిపించింది. వెంటనే అది మనిషి శరీరమని నాకు అర్థమైంది. తలకు పాలిథిన్ సంచి చుట్టి ఉంది. ఇది మానవ శరీరమని ప్రజలు నిర్ధారించిన తర్వాత, మేము పోలీసులకు సమాచారం అందించాము.'' అని చెరువుకు ఆనుకుని ఉన్న ఇంటి యాజమాని సుభ్రా ఛటర్జీ చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలోని పాలిథిన్ సంచిలో మనిషి తల చుట్టి ఉంది. ''బాధిత వ్యక్తి యొక్క ప్రాంతాన్ని కనుగొనడంలో అది మాకు సహాయపడింది. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత తల్లీకొడుకులను విచారించాం. నవంబర్ 15 తెల్లవారుజామున వారు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో వారిపై అనుమానం వచ్చింది. తప్పిపోయిన ఫిర్యాదు చేయడానికి వారు బరుయ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది మేము నిర్ధారించిన తర్వాత కూడా, ఉజ్జవల్‌కు మద్యపానం అలవాటు ఉన్నందున బయటి వ్యక్తి ఎవరో హత్య చేసి ఉంటాడని, తరచూ గొడవలకు దిగేవాడని వారు పేర్కొన్నారు. కానీ సుదీర్ఘ విచారణ తర్వాత, వారు అతన్ని చంపి, శరీరాన్ని ఆరు భాగాలుగా నరికివేసినట్లు అంగీకరించారు.'' అని విచారణలో పాల్గొన్న ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఇప్పటి వరకు, తల, నడుము, రెండు కాళ్లతో సహా ఆరు శరీర భాగాలలో నాలుగు భాగాలను పోలీసులు కనుగొన్నారు. చెత్త కుప్ప కింద రెండు కాళ్లు బయటపడగా, దేహిమేడన్ మల్లాలోని చెరువులో తల, పొట్ట బయటపడ్డాయి. మృతుడి రెండు చేతులు పోలీసులకు ఇంకా దొరకలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య జరిగిన రోజు రాత్రి కొడుకు తన తల్లితో కలిసి శరీర భాగాలను పారవేసేందుకు ఆరుసార్లు ఇంటి నుండి బయలుదేరాడు. ఆదివారం మహిళ, ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచగా, వారిని 12 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.

Next Story