హైదరాబాద్: ఓ మహిళ ఇంట్లోకి చోరబడి బెదిరించినందుకు మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు వి.శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు మరో 20 మందిపై మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్ కాలనీలోని తన నివాసంలోకి ప్రవేశించిన శ్రీకాంత్‌గౌడ్, మరికొందరు.. గట్టు వెంకట్‌రెడ్డి, వాచ్‌మెన్ సచిన్‌పై ఇనుప రాడ్‌లతో దాడికి పాల్పడ్డారని జి. వనజారెడ్డి (55) అనే గృహిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వారు తన మూడో అంతస్థులోని నివాసంలోకి ప్రవేశించి తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. సెక్షన్లు 448, 324, 427, 504, 506, 379 ఆర్‌డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 15న అదనంగా 458, 354, 323 సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో ఏ-3గా ఉన్న కలాల్ మహేష్ కుమార్ గౌడ్, ఎ-6 కలాల్ రమేశ్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వి.శ్రీకాంత్‌గౌడ్, పడమటి శ్రీకాంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, కిశోర్(కౌన్సిలర్), గణేశ్‌యాదవ్, వేణుగోపాల్‌రెడ్డి, మనీష్‌గౌడ్, వెంకటేశ్ తదితరులు పరారీలో ఉన్నారని మహబూబ్‌నగర్ పోలీసులు తెలిపారు.