ఇదేం అక్కసు తల్లీ..ప్రియుడి భార్యకు HIV వైరస్ ఇంజక్షన్ ఇచ్చిన మాజీ ప్రేయసి
ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు ఓ వైరస్ ఇంజక్షన్ వేసిన సంచలన ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది.
By - Knakam Karthik |
ఇదేం అక్కసు తల్లీ..ప్రియుడి భార్యకు HIV వైరస్ ఇంజక్షన్ ఇచ్చిన మాజీ ప్రేయసి
తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని సినీ ఫక్కీలో ప్రియుడి భార్యకు మాజీ ప్రియురాలు ఓ వైరస్ ఇంజక్షన్ వేసిన సంచలన ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. కర్నూలు కు చెందిన డాక్టర్. కరుణాకర్, ఆదోని కి చెందిన వసుంధర కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమికులుగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయారు. డాక్టర్ కరుణాకర్ మరో మహిళ డాక్టర్.శ్రావణిని పెళ్లి చేసుకున్నారు. శ్రావణి కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ఫ్రోఫెసర్ గా విధులు నిర్వహిస్తుండగా డాక్టర్ కరుణాకర్ కర్నూలులోని విశ్వభారతి ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను జీర్ణించుకోలేక అక్కసుతో వారి ఇద్దరిని విడదీయాలని వసుంధర ఓ కుట్ర పన్నింది. అందులో భాగంగా ఈనెల 9వ తేదీ డాక్టర్ శ్రావణి విధులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి శ్రావణి ద్విచక్ర వాహనాన్ని ఢి కొట్టి కిందపడేలా చేశారు. కింద పడిన ఆమెకు సహయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కిస్తూ ఓ వైరస్(HIV) ఎక్కించారని కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈఘటనపై భాదితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న 3వ పట్టణ పోలీసులు ధర్యాఫ్తు చేయగా ఘటన స్థలం వద్ద సీసీ కెమారాల సహయంతో నిందితులను గుర్తింపు వారిని అరెస్ట్ చేశారు. ఈకేసులో మాజీ ప్రియురాలు వసుంధర తో పాట జ్యోతి, జశ్వంత్, శృతి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.