దారుణం.. 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Eight Class student molested in Kadapa District.ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Oct 2022 11:42 AM IST
దారుణం.. 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి పండు ముస‌లి వాళ్ల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు కామాంధులు. ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో జ‌రిగింది.

క‌డ‌ప జిల్లాలోని గోప‌వ‌రం మండ‌లం రాచాయ‌పేట‌లో ఓ విద్యార్థిని ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఇటీవ‌ల ఆ బాలిక‌పై ప‌లువురు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసి బాలిక‌ను బెదిరించి ప‌లుమార్లు లైంగిక దాడి చేశారు. బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డింది. ప‌ది, ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. నిందితుల‌పై ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story