మద్యం మత్తులో.. భార్యను కొట్టి తలపై మూత్రం పోసిన భర్త

Drug Addict Husband Assault, Urinates on Wife's Head. మద్యం, డ్రగ్స్‌ బానిసైన ఓ భర్త మత్తులో తన భార్య తలపై మూత్ర విసర్జన చేశాడు. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on  11 Aug 2022 2:04 PM IST
మద్యం మత్తులో.. భార్యను కొట్టి తలపై మూత్రం పోసిన భర్త

మద్యం, డ్రగ్స్‌ బానిసైన ఓ భర్త మత్తులో తన భార్య తలపై మూత్ర విసర్జన చేశాడు. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్‌కు అడిక్ట్‌ అయిన భర్తపై కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ప్రముఖ గార్మెంట్‌ ఫ్యాక్టరీ యజమాని కుమార్తెకు సందీప్‌ అనే వ్యక్తితో గత జనవరిలో వివాహం జరిగింది. రామోజీరావు ఫిల్మ్ సిటీలో వీరి వివాహం జరిగింది.

అల్లుడికి కట్నంగా బాధితురాలి తల్లిదండ్రులు 4 కిలోల బంగారం, మినీ కూపర్ కారును కట్నంగా ఇచ్చారు. అలాగే తెలంగాణలో రెండు క్లాత్ షోరూమ్‌లను బహుమతిగా ఇచ్చారని పోలీసులు తెలిపారు. కుమార్తె పెళ్లికి తల్లిదండ్రులు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. అయితే వారికి తాము అపురూపంగా పెంచుకున్న బిడ్డను ఒక నీచుడితో పంపుతున్నట్లు ఆ దంపతులకు తెలియదు. పెళ్లి తర్వాత సందీప్‌ డ్రగ్స్‌కు బానిస అని తెలిసింది. మత్తులో భార్యను పలు రకాలుగా వేధించేవాడు. ఇంట్లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేవాడు.

తన స్నేహితులను ఇంటికి ఆహ్వానించడాన్ని భార్య వ్యతిరేకించినప్పుడల్లా నిందితుడు తన స్నేహితుల ముందే ఆమెపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. భర్త తనతో అసభ్యంగా ప్రవర్తించాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల మందు తాగి మత్తులో ఆమె తలపై మూత్ర విసర్జన చేశాడు. ఇటీవల ఈ హింస మరీ హద్దు మీరిందని, చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడంటూ, వేధింపులకు పాల్పడిన తన భర్తపై చర్యలు తీసుకోవాలని భార్య పోలీసులను కోరింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story