కర్నూలులో జంట హత్యల కలకలం
Double Murders hulchul in Kurnool.కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. వెలుగోడు సీపీనగర్‌లో ఇద్దరిని
By తోట వంశీ కుమార్ Published on 25 Sep 2021 6:51 AM GMT
కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. వెలుగోడు సీపీనగర్‌లో ఇద్దరిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరంతా కలిసి వెలుగోడులో నివాసం ఉంటున్నారు. మల్లికార్జున దగ్గర ఓబులేసు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడు కూడా ఆ ఇంట్లోనే ఉండేవాడు. కాగా.. శుక్రవారం అర్థరాత్రి ఓబులేసును, మల్లికార్జున రెండో భార్య చిన్నిని దారుణంగా హత్య చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమై ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున తండ్రి ఈ హత్యలకు పాల్పడినట్లుగా బావిస్తున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.