బాలికపై అత్యాచారం.. నోట్లో యాసిడ్‌ పోసి హత్యకు యత్నం

Delhi Police arrest factory manager for raping minor employee. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యాక్టరీ మేనేజర్ తన కింద పనిచేస్తున్న 15 ఏళ్ల బాలికపై అ

By అంజి  Published on  17 July 2022 8:21 AM GMT
బాలికపై అత్యాచారం.. నోట్లో యాసిడ్‌ పోసి హత్యకు యత్నం

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యాక్టరీ మేనేజర్ తన కింద పనిచేస్తున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి బలవంతంగా యాసిడ్ తాగించి చంపేందుకు ప్లాన్‌ చేశాడు. ఈ కేసులో ఫ్యాక్టరీ మేనేజర్ జై ప్రకాష్ (31)ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 2న తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని, ఇంటి పని నిమిత్తం బాధితురాలిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత రెండు రోజులకు తాను చేసిన పాడు పనిని బాధితురాలు ఎవరికైనా చెబుతుందేమోనని భయంతో.. బాధితురాలిని నోటిలో ప్రకాష్ యాసిడ్ లాంటి ద్రవాన్ని పోశాడు. బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత అపస్మారక స్థితికి చేరుకుంది. బాలిక పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆమెను ఆల్‌ ఇండియా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేర్పించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు.

శనివారం ఓ ఎన్జీవో సభ్యుడి సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిపారు. నంగ్లోయ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ, పోక్సో చట్టం సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం), 376 (అత్యాచారానికి శిక్ష), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యాయత్నానికి సంబంధించి ఫిర్యాదు అందినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తన కూతురు షూ ఫ్యాక్టరీలో పనిచేసేదని చెప్పాడు. ఒకరోజు, ఫ్యాక్టరీ కాంట్రాక్టర్ తన భార్య అనారోగ్యం సాకుతో తన కుమార్తెను తన ఇంటికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడని ఫిర్యాదుదారుడు (బాలిక తండ్రి) ఆరోపించాడు. జులై 5న నిందితుడు తన కూతురికి బలవంతంగా యాసిడ్ తాగించాడని అతను ఆరోపించాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరింది.

ఈ విషయాన్ని గుర్తించిన డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ''ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌, అరెస్టుల వివరాలను కమిషన్‌ కోరింది. ఆసుపత్రిలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను వెంటనే రికార్డ్ చేసి మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని మహిళా హక్కుల సంఘం పోలీసులను కోరింది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యాయత్నానికి సంబంధించి మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదు అందింది.'' అని పేర్కొంది. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని అని మలివాల్ తెలిపారు.

Next Story