ఓ పోలీసు కానిస్టేబుల్ తన కుమారుడిని కరిచినా కుక్కను బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి అతి కిరాతకంగా చంపాడు. దీంతో అతడిని నోయిడాలో అరెస్టు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. నిందితుడు నోయిడా సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 44లోని చలేరా గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కానిస్టేబుల్ అతని కుటుంబం బయట వెళుతున్న సమయంలో కుక్కలు అరవడం మొదలుపెట్టేవి. ఆదివారం రాత్రి ఓ కుక్క కానిస్టేబుల్ కొడుకును కరిచింది. దీంతో అతను కోపంతో కుక్కపై దాడి చేసినట్లు తెలుస్తోందని నోయిడా పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఊరకుక్కను అతికిరాతకంగా చంపేసిన తర్వాత ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్, స్థానిక ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐపిసి సెక్షన్ 429 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశామని అధికారి తెలిపారు. కానిస్టేబుల్, వినోద్ కుమార్, దాదాపు 35 సంవత్సరాల వయస్సు గలవాడు, ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందినవాడు. సోమవారం మధ్యాహ్నం స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కుమార్ కొంతమంది స్థానిక వ్యక్తుల మధ్య గొడవకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.